మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య వార్తల్లో తరచుగా వినిపిస్తున్న పేరు. అయితే ఈసారి తమన్నా పేరు వార్తల్లో ఏదో సినిమాకి సంబంధించి కాకుండా ఆమె పెళ్ళి గురించి వస్తుండడం అందరికి ఆసక్తి కలిగిస్తున్న అంశం.
ఈ వార్తలు ఏ స్థాయికి వెళ్ళాయి అంటే ఆమె చేసుకోబోయే వ్యక్తి ఒక డాక్టర్ అని కూడా బయటకి రావడంతో స్వయంగా తమన్నానే రంగంలోకి దిగక తప్పలేదు. తన ట్విట్టర్ ద్వారా ఈ అంశం పైన స్పందిస్తూ- ఒకప్పుడు యాక్టర్ అన్నారు, తరువాత క్రికెటర్ అన్నారు, ఇక ఇప్పుడు డాక్టర్ అన్నారు. ఇలా నాకు తెలియకుండానే నాకు పెళ్ళిలు చేయకండి. నేను కాని నా కుటుంబం కాని నా పెళ్ళికి సంబంధించిన ఇప్పుడు ఎటువంటి ఆసక్తి చూపడంలేదు.
ప్రస్తుతానికి నా మనసు సినిమాలు తప్ప వేరేవాటి పైన లేదు అని చెబుతూ తన పెళ్ళికి సమయం వచ్చినప్పుడు తానే చెబుతాను అని ఈ పూర్తి అంశానికి ముగింపు పలికింది.
ఈ క్లారిటీ తో తమన్నా పెళ్ళి పై వస్తున్న పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టగలిగింది.