పుట్టినరోజు పార్టీ లో మహేష్-తారక్-చరణ్..!

By iQlikMovies - July 28, 2018 - 11:34 AM IST

మరిన్ని వార్తలు

 

గత ఆరు నెలలుగా మహేష్-తారక్-చరణ్ లు తరుచుగా కలుస్తుండడం, ఒకరి పిల్లలకి మరొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఈ ముగ్గురు హీరోలు ఒక దర్శకుడి పుట్టినరోజుకి ఒకే చోటకి చేరడం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా? వంశీ పైడిపల్లి. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా హీరోలు మహేష్-తారక్-చరణ్ ఒకచోట చేరారట. ఇప్పటికే ఈ ముగ్గురు తరచుగా కలుస్తూ తమ ఫ్యాన్స్ కి ఆనందాన్ని పంచుతున్న సమయంలో మరోసారి ఈ ముగ్గురు ఇలా కలవడం అందరినీ మరింత సంతోషానికి గురిచేసే అంశం.

ఇక వంశీ ఇప్పటికే ఎన్టీఆర్ తో బృందావనం, రామ్ చరణ్ తో ఎవడు చిత్రాలు చేయగా ఇప్పుడు మహేష్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. దీనితో ఈ ముగ్గురు అగ్ర హీరోలతో చిత్రాలు చేసిన దర్శకుల జాబీతాలో వంశీ కూడా చేరిపోయాడు.

ఏదేమైనా తమ దర్శకుడి పుట్టినరోజు ఈ ముగ్గురు ఇలా రావడం చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS