ఆ డైరెక్టర్ గురించి నన్ను అడగకండి: తమన్నా

మరిన్ని వార్తలు

హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లో- తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం లో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగానే తెలుగు వెర్షన్ కి వస్తే, ప్రధాన పాత్రలో నటి తమన్నా నటిస్తుండగా ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తాజాగా నీలకంఠ ఈ చిత్రం నుండి తప్పుకోవడంతో ఈ చిత్రం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. దర్శకుడు ఇలా వెళ్ళిపోవడం వెనుక ఆయనకీ హీరోయిన్ తమన్నాకి మధ్య తలెత్తిన్న అభిప్రాయ భేదాలే కారణమని వార్తలు రావడం అవి తమన్నా వరకు చేరాయి. దీనితో ఈ అంశం పైన క్లారిటీ ఇవ్వాలి అని నిర్ణయించుకుని తమన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.

అదేంటంటే - సినిమాకి సంబంధించిన ఎటువంటి మార్పులకైనా చేర్పులకైన పూర్తి హక్కు నిర్మాతకి మాత్రమే ఉంటుంది. అంతే తప్ప నీలకంఠ గారిని తప్పించడానికి నాకు ఆయనకి వచ్చిన  భేదాభిప్రాయాలు అని అనడం తప్పు. ఆయన పైన నాకు చాలా మంచి అభిప్రాయమే కాదు, గౌరవం కూడా ఉంది.

ఏ సినిమాలో అయినా సరే ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయ్యాలి అన్న దానిపై పూర్తి హక్కు నిర్మాతకే ఉంటుంది. ఈ సినిమా పరంగా కూడా అదే జరిగింది, అంతే తప్ప ఈ పరిణామంతో తనకెలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది.

త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తమన్నా తెలిపింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS