స్టార్ హీరోల‌పై త‌మ‌న్నా సెటైర్లు

మరిన్ని వార్తలు

క‌థానాయ‌కులంటేనే హీరోల‌కు 'భ‌జ‌న‌' చేయాల్సిందే. తెర‌పై ఎలాగూ 'ప్రేమించండి బాబూ..' అంటూ వాళ్ల వెంట ప‌డుతుంటారు. బ‌య‌ట కూడా 'వీరులూ ధీరులూ' అంటూ మెచ్చుకోవాల్సిందే.  ముఖ‌స్తుతి కోసం మాట్లాడితేనే వాళ్ల‌కు మ‌నుగ‌డ‌. కాక‌పోతే త‌మ‌న్నా మ‌న స్టార్ హీరోల‌పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేసింది. ఓ విధంగా చెప్పాలంటే.. స్టార్ హీరోలు ప్ర‌యోగాల‌కు భ‌య‌ప‌డ‌తారు అనే స్టేట్మెంట్ ఇచ్చేసింది.

 

త‌మ‌న్నా న‌టించిన చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'.  ఈవారంలోనే విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ స్టార్‌హీరో గురించి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది.  ఇది వ‌ర‌కు ప్ర‌యోగాల పేరు చెబితే హీరోలు భ‌య‌ప‌డేవార‌ని, తెల్ల‌రంగు వేసుకోవాల‌న్నా వెనుకంజ వేసేవార‌ని కాస్త సెటైరిక‌ల్‌గా మాట్లాడింది.  కాక‌పోతే అంత‌లోనే స‌ర్దుకుని..

 

ఇప్పుడంతా మారిపోయార‌ని, ప్ర‌యోగాలు చేయ‌డానికి భ‌య‌ప‌డ‌డం లేద‌ని, యంగ్ హీరో ఓల్డ్ గెట‌ప్‌లో క‌నిపించ‌డానికీ, ఓల్డ్ హీరో యంగ్ గెట‌ప్‌లో క‌నిపించ‌డానికి రెడీగానే ఉన్నార‌ని కితాబులు ఇచ్చింది.  మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ... ''క‌థానాయిక‌గా నా ప‌నైపోయింది అని మీడియాలో వార్త‌లు వ‌చ్చిన ప్ర‌తీసారీ నాకు అవ‌కాశాలు పెరుగుతుంటాయి. అందుకే అలాంటి వార్త‌లు విని బాధ‌ప‌డ‌ను. ఆనందంగా అనిపిస్తుంది'' అని లైట్ తీసుకుంది త‌మ‌న్నా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS