వన్నె తరగని మిల్కీ గ్లామర్‌.!

మరిన్ని వార్తలు

పదేళ్లు పైగానే తెలుగు ఇండస్ట్రీని ఏలుతోన్న ముద్దుగుమ్మ మిల్కీబ్యూటీ తమన్నా. ఎన్ని సినిమాలు చేసినా ఫిజిక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. అంతకంతకూ వన్నె పెరిగిందే తప్ప. ఆమె స్కిన్‌ కలర్‌కి మొదట్లో తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పటికీ ఎప్పటికీ ఆమె పట్ల అదే అభిమానం చూపిస్తూ ఉంటారు అభిమానులు. మొదట్లో గ్లామర్‌ పాత్రల్లో మాత్రమే మెరిసిన తమన్నా, ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించేందుకు ఇష్టపడుతోంది. ప్రస్తుతం వెంకటేష్‌ - వరుణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో వెంకీతో జత కడుతోంది తమన్నా. అలాగే ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'సైరా'లో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. తమన్నా నటిస్తున్న క్వీన్‌ తెలుగు రీమేక్‌ చిత్రీకరణ దశలో ఉంది. 'దటీజ్‌ మహాలక్ష్మీ' పేరుతో రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ తన గ్లామర్‌ యాంగిల్స్‌ని ప్రదర్శనకు పెడుతూ అభిమానులకు కొత్త కొత్త కిక్‌ ఇస్తుంటుంది మిల్కీ బ్యూటీ. అందులో భాగంగానే ఈ ట్రెడిషనల్‌ వేర్‌లో స్వీట్‌ అండ్‌ హాట్‌ లుక్స్‌తో తమన్నా కెవ్వుకేక పుట్టిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS