ఈ పైన టైటిల్ చూసి అవాక్కయ్యారా? రజినీకాంత్ సినిమాని కొనేవారు లేరంటే.. ఇది నిజంగా ఒక షాకింగ్ వార్తే అని చెప్పొచ్చు.
ఇక వివరాల్లోకి వెళితే, రజినీకాంత్ కాలా చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే తమిళ వెర్షన్ కి సంబంధించి సెన్సార్ పూర్తయింది. అయితే ఇప్పుడు కాలా తెలుగు వెర్షన్ విడుదలకి సంబంధించి విడుదల ఇప్పుడు కష్టంగా మారింది.
దీనికి ప్రధాన కారణం దర్శకుడు Pa.రంజిత్ - రజినీకాంత్ కలయికలో వచ్చిన ‘కబాలి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడమే కాకుండా, సినిమా కొన్న అందరికీ తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ తరుణంలో మళ్ళీ వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి.
దానికి తోడు సినిమాని కొనడానికి వెళ్ళినవాళ్ళకి చాలా ఎక్కువ మొత్తం అంటే బిజినెస్ రేంజ్ దాటి మరీ ‘ధర’ చెప్పడంతో కాలా సినిమాని కొనేందుకు ఎవ్వరూ ఉత్సాహం చూపడం లేదు.
చివరికి రజినీకాంత్ సినిమాకి కూడా ఇటువంటి ఇబ్బందులు తప్పడం లేదు.