ఐటెమ్ గీతాల రారాణి తమన్నా. టాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్ తో ఐటెమ్ గీతం చేయించాలంటే తమన్నా పేరే ముందు గుర్తొస్తుంది. ఇప్పుడు తన ఖాతాలో మరో ఐటెమ్ గీతం చేరిపోయింది. `గని`లో తమన్నా ఓ ఐటెమ్ గీతం చేసింది. ఈ పాటని ఈనెల 15న విడుదల చేస్తున్నారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఈ సినిమాలో `కొడితే` అనే ఓ ఐటెమ్ గీతం ఉంది. రామ జోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు తమన్ స్వరాలు అందించారు. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్నా రాకతో.. ఈ సినిమాకి గ్లామర్ డోసు కూడా పెరిగినట్టైంది.
ఐటెమ్ గీతాల కోసం తమన్నా భారీ పారితోషికాలే పుచ్చుకుంటోంది. మినిమం రూ.50 లక్షలు లేనిదే సినిమా చేయదు. ఈసారీ అంతే. ఈ సినిమాలో ఐటెమ్ గీతం కోసం తమన్నా రూ.75 లక్షల వరకూ పారితోషికం అందుకుందని సమాచారం. ఇటీవల `పుష్ప`లో ఐటెమ్ గీతం చేసినందుకు సమంతకు కోటిన్నర ఇచ్చారు. నిజానికి ఆ పాట తమన్నానే చేయాలి. చివరి నిమిషంలో సమంత చేతిలో పడింది.