చిరంజీవి - వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చిరు ప్రస్తుతం లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో బిజీగా ఉన్నారు. బాబితో ఓసినిమా చేస్తున్నారు. మరోవైపను.. `భోళా శంకర్` ఉండనే ఉంది. ఇవన్నీ పూర్తయ్యాక వెంకీ కుడుముల సినిమాని పట్టాలెక్కిస్తారు. ఈ చిత్రంలో కథానాయికగా శ్రుతి హాసన్ పేరు గట్టిగా వినిపించింది. శ్రుతిని చిరు కోసం లాక్ చేశారని గుసగుసలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనుష్క పేరు కూడా చేరింది. ఈసినిమాలో హీరోయిన్ గా అనుష్క దాదాపు ఖాయమన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.
ఎప్పుడైతే అనుష్క పేరు బయటకు వచ్చిందో, అప్పుడు శ్రుతి ఉందా, లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లా? లేదంటే శ్రుతి స్థానంలో అనుష్క వచ్చిందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. అయితే ఒకటి మాత్రం నిజం. అనుష్క, శ్రుతిలలో ఒకరు ఖాయంగా ఈసినిమాలో ఉంటారు. అనుష్క ఇది వరకు `స్టాలిన్`లో ఓ ప్రత్యేక గీతంలో నటించింది. `సైరా నరసింహారెడ్డి`లో అనుష్క ఉంది కానీ, చిరుకి జోడీ కాదు. ఈసారి మాత్రం చిరుకి జోడీగా నటిస్తే.. కనుల పండుగలా ఉంటుంది. అయితే అనుష్క ఉందా, లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది.