కళ్యాణ్ రామ్ - తమన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'నా నువ్వే'. జయేంద్ర దర్వకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన తమన్నా దూకుడు ఈ మధ్య తెలుగులో తగ్గిందనే చెప్పాలి. దాంతో చాలా కాలం తర్వాత తమన్నాని స్క్రీన్‌పై చూసిన ఫ్రెష్ ఫీల్ కనిపిస్తోంది ఈ సినిమాలో. అలాగే యాక్టింగ్ పరంగానూ తమన్నా తనలోని న్యూ యాంగిల్‌ని బయటికి తీసినట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్‌తోనే తమన్నా తనలోని భావాలను ఇంతగా పలికించిందంటే ఇక సినిమాలో ఆమె పాత్ర ఇంకెంత ప్రాధాన్యత కల్గిందో అర్ధం చేసుకోవాలి.
'బాహుబలి ది బిగినింగ్'లో ప్రబాస్ పక్కన తమన్నా అందంగా కనిపించి అభిమానుల్ని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా 'నా నువ్వే' చిత్రం ద్వారానే తమన్నా కనిపించబోతోంది. క్యూట్ అండ్ సాఫ్ట్ లవ్‌స్టోరీలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రేడియో జాకీలా నటిస్తోంది తమన్నా ఈ సినిమాలో. కళ్యాణ్‌రామ్ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవల 'ఎమ్మెల్యే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్‌రామ్ త్వరలోనే 'నా నువ్వే' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
సరికొత్త కథనంతో, డిఫరెంట్ మ్యూజిక్‌తో 'నా నువ్వే' చిత్రం ద్వారా తమన్నా అండ్ కళ్యాణ్‌రామ్ ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నారు. డీప్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా 'నా నువ్వే' అభిమానులకు న్యూ ఫీల్ ఇచ్చేందుకు త్వరలోనే వచ్చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీలకు భిన్నంగా ఈ స్టోరీ ఉండేలా అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. మొత్తానికి ట్రైలర్‌తో కట్టి పడేసిన తమన్నా - కళ్యాణ్‌రామ్ సినిమాతో ఏం చేస్తారో చూడాలిక.