మిల్కీబ్యూటీ కిర్రాక్‌ షో

మరిన్ని వార్తలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఈరోజు నుండి ప్రారంభం కానుంది. దీనికి మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్‌ డాన్స్‌ చేయనుందట. ఈ షో కోసం మిల్కీ బ్యూటీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకోనుందనీ తెలుస్తోంది. 

అయితే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ అయిన కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనె వంటి ముద్దుగుమ్మల్ని పక్కన పెట్టి, తమన్నాని ఈ షోకి ఎంపిక చేసుకోవడం విశేషం. తమన్నా మంచి డాన్సర్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె డాన్సింగ్‌ టాలెంట్‌ని ఎన్నో సార్లు ప్రూవ్‌ చేసుకుంది కూడా. అయితే అదంతా ఒకెత్తు. ఈ ఐపీఎల్‌లో తమన్నా డాన్స్‌ షో మరో ఎత్తు. ఓ గ్రేట్‌ అచీవ్‌మెంట్‌గా ఈ డాన్స్‌ షోని తమన్నా భావిస్తోందట. ఈ షోలో తమన్నా డాన్స్‌కి 70 లక్షల వరకూ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేశారనీ గాసిప్‌ వినిపిస్తోంది. 

నిజానికి ఇది తక్కువ అమౌంటే. అదే బాలీవుడ్‌ స్టార్స్‌కి అయితే రెండు నుండి, మూడు కోట్లు వరకూ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ ఈవెంట్‌కి తన డాన్స్‌ షో ఉండడం గొప్పగా భావిస్తోన్న తమన్నా, రెమ్యునరేషన్‌ పెద్దగా లెక్క కాదంటోంది. మొత్తానికి ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, మన మిల్కీ బ్యూటీ తమన్నా ఇద్దరూ స్పెషల్‌ అట్రాక్షన్‌ కానున్నారు. 

మరోపక్క ఈ ఐపీఎల్‌ని తెలుగులో ప్రసారం చేసేందుకు ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS