మిల్కీ బ్యూటీ తమన్నా

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ అందాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు. రాజమౌళి 'బాహుబలి' సినిమాలో ఒకే ఒక్క పాటలో తమన్నా గ్లామర్‌ని పీక్స్‌లో చూపించేశాడు. అంతకు మించిన గ్లామర్‌ తమన్నా నుంచి ఆశించగలమా? అంటే, ఎందుకు ఆశించలేం! అనే సమాధానం చెప్పాల్సి వుంటుంది. 

త్వరలో 'క్వీన్‌' సినిమాలో కన్పించబోతోంది తమన్నా. బాలీవుడ్‌ 'క్వీన్‌'కి ఇది తెలుగు రీమేక్‌. తెలుగులో కళ్యాణ్‌రామ్‌ సరసన తమన్నా ఓ సినిమాలో నటిస్తోంది. తమిళంలోనూ రెండు మూడు సినిమాల్లో బిజీగా వుంది ఈ మిల్కీ బ్యూటీ. వయసు మీద పడ్తోన్న కొద్దీ కొందరు అందాల భామల అందం రెట్టింపవుతుండడం ఆశ్చర్యకరమే. ఆ లిస్ట్‌లో తమన్నా పేరు ఖచ్చితంగా ముందు వరుసలోనే వుంటుంది. తన గ్లామర్‌ సీక్రెట్‌ ఎప్పుడూ హ్యాపీగా వుండడమేనని అంటోంది మిల్కీ బ్యూటీ. 

బాలీవుడ్‌ నుంచీ అవకాశాలు వస్తున్నాయనీ, ప్రస్తుతం సౌత్‌ సినిమాలతో బిజీగా వుండడంతో బాలీవుడ్‌ నుంచి వస్తోన్న సినిమాల్ని ఒప్పుకోవడంలేదనీ తమన్నా చెబుతోంది. అలా అంటోందిగానీ, బాలీవుడ్‌ నుంచి సరైన ఆఫర్‌ వస్తే మిల్కీ బ్యూటీ వదిలేసుకుంటుందా? ఆ సంగతి పక్కన పెడితే, ఇదిగో ఈ ఫొటోలో మిల్కీ బ్యూటీ గోల్డెన్‌ అందం కెవ్వు కేక అనే రేంజ్‌లో లేదూ! మిల్కీ కలర్‌ స్కిన్‌ని గోల్డెన్‌ కలర్‌ డ్రెస్‌ ఇంకా బాగా ఎలివేట్‌ చేసేస్తోంది. దటీజ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS