సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో ఆడుకోవడం 'ట్రాలర్స్'కి అలవాటైపోయింది. అనసూయ విషయంలో అలాగే కొందరు నెటిజన్లు ప్రదర్శించిన అత్యుత్సాహం కొన్నాళ్ళపాటు ఆమె సోషల్ మీడియాకి దూరమయ్యేలా చేసింది.
అనసూయలానే, రష్మినీ కొందరు టార్గెట్ చేశారు. గతంలోనూ రష్మికి వ్యతిరేకంగా ట్రాలింగ్ జరిగితే, దాన్ని ఆమె లైట్ తీసుకుంది. ఇప్పుడూ అలాగే లైట్ తీసుకుంది రష్మి. ఎక్స్‌పోజింగ్ గురించీ, జబర్‌దస్త్ కామెడీ షో గురించీ, సినిమాల్లో వల్గారిటీ గురించీ నెటిజన్లు రష్మికి ప్రశ్నాస్త్రాలు సంధిస్తే, వాటికి అంతే ధీటుగా రష్మి కౌంటర్ ఇచ్చింది. గ్లామర్ విషయంలో ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో తనకు తెలుసనీ, తనకెవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరమే లేదని రష్మి తేల్చి చెప్పింది.
ఒక్క మాటలో చెప్పాలంటే 'నా ఇష్టం' అంటూ వర్మ స్టయిల్లో రష్మి ఇచ్చిన కౌంటర్ ఎటాక్‌కి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ విషయంలో రష్మిని తప్పు పట్టడానికేమీ లేదు. వెండితెరపైనా, బుల్లితెరపైనా రష్మి తనదైన ముద్ర వేసింది తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఐశ్వర్యారాయ్‌నే తీసుకుంటే ఆమె ఎక్స్‌పోజింగ్‌లో పీహెచ్‌డీ చేసేసినట్లు చాలా సినిమాల్లో నటించిన విషయాన్ని ఎలా కాదనగలం?
జబర్‌దస్త్ కామెడీ షో విషయానికొస్తే, ఇలాంటి షోస్ చాలానే వచ్చాయి. వస్తూనే వున్నాయి కూడా. జబర్‌దస్త్ అంత పెద్ద హిట్ అయ్యిందంటే రష్మి, అనసూయ గ్లామర్ కారణంగానే. 'మేం, ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం గురించే ఆలోచిస్తాం. మా షో ఎక్కువమందికి నచ్చకపోతే, ఆ షో త్వరగా క్లోజ్ అయిపోవాలి. కానీ అలా జరగలేదు. దానర్థం ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కాబట్టి కొందరి అభ్యంతరాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ రష్మి స్పష్టతనిచ్చింది.