మిల్కీ బ్యూటీ ఖాతాలో మరో హారర్‌!

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది గ్లామర్‌ షోతో పిచ్చెక్కించేస్తోంది. ఆ గ్లామర్‌కి కొన్ని సక్సెస్‌లు వచ్చినా, కొన్ని ఫెయిల్యూర్స్‌ తప్పడం లేదు. 'ఎఫ్‌ 2'తో మంచి కమర్షియల్‌ హిట్‌ అందుకున్న తమన్నా, రీసెంట్‌గా వచ్చిన 'అభినేత్రి 2'తో బోల్తా కొట్టింది. త్వరలో 'సైరా' సినిమాతో రాబోతోంది. దీంతో పాటు 'దటీజ్‌ మహాలక్ష్మి' వంటి చిత్రాలూ లైన్‌లో ఉన్నాయి. ఇకపోతే, తాజాగా తమన్నా చేతిలో మరో ప్రాజెక్ట్‌ వచ్చి చేరింది. తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన 'అభినేత్రి 2' ఆశించిన విజయం అందుకోకపోయినా, తమిళంలో మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ దక్కింది తమన్నా.

 

తాప్సీ హీరోయిన్‌గా వచ్చిన 'ఆనందోబ్రహ్మ' చిత్రం చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సింపుల్‌గా హ్యూమరస్‌గా తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహి.వి.రాఘవ. ఈ సింప్లిసిటీ ఆడియన్స్‌కి తెగ నచ్చేసింది. సినిమాని ఆదరించారు. ఇప్పుడిదే చిత్రం తమిళంలో రీమేక్‌ అవుతోంది. తాప్సీ పాత్రలో తమన్నా నటించబోతోంది.రోహిన్‌ వెంకటేషన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆనందోబ్రహ్మ'లో తాప్సీ పెద్దగా గ్లామర్‌ పండించలేదు. కానీ, తమన్నా ఈ సినిమాలో లిమిటెడ్‌ డోస్‌లో గ్లామర్‌ ఒలకబోయనుందని తెలుస్తోంది.

 

'ఎఫ్‌ 2' సంగతి పక్కన పెడితే, లేటెస్ట్‌గా 'అభినేత్రి 2'లో తమన్నా గ్లామర్‌ ఏ రేంజ్‌లో ఉందో చూశాం. అందుకు తగ్గకుండా, 'ఆనందోబ్రహ్మ' రీమేక్‌లోనూ మిల్కీబ్యూటీ స్కిన్‌ షోకి సిద్ధమవుతోందనీ కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. చూడాలి మరి, ఈ హారర్‌ గ్లామర్‌ షో ఈ సారైనా తమ్మూకి కలిసొస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS