మన్మధుడి ఫ్లాష్‌బ్యాక్‌ లవర్‌ తెలిసిపోయిందోచ్‌!

మరిన్ని వార్తలు

క్లాసిక్‌ హిట్‌ 'మన్మధుడు'కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'మన్మధుడు 2'. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా నటిస్తోంది. అయితే, 'మన్మధుడు 2' అంటే ఖచ్చితంగా రెండో హీరోయిన్‌ కూడా ఉండి తీరాలి. మొదటి 'మన్మధుడు' లాగే రెండో 'మన్మధుడు'కీ ఓ రొమాంటిక్‌ హార్ట్‌ టచ్చింగ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఉందట. మరి ఆ ఫ్లాష్‌ బ్యాక్‌లో మన్మధుడితో రొమాన్స్‌ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరా.? అని కొన్ని రోజులుగా పలు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.

 

అయితే, చిత్ర యూనిట్‌ ఈ ప్రచారాలకు చెక్‌ పెట్టేలా, ఫ్యాన్స్‌లో సస్పెన్స్‌ వీడేలా ఓ ఫోటో రిలీజ్‌ చేసింది. ఆ ఫోటోలో మన రెండో మన్మధుడుతో పాటు 'మహానటి' కీర్తి సురేష్‌ కనిపించి షాకిచ్చింది. మన్మధుడి ఒడిలో కీర్తి సురేష్‌ సరదాగా రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న ఫోటో అది. అంటే కన్‌ఫామ్‌ అయిపోయింది.. మన్మధుడితో మహానటి జోడీ కడుతోందని. ఇది నిజంగా అన్‌ ఎక్స్‌పెక్ట్‌డ్‌ కాంబినేషనే అని చెప్పాలి. మొత్తానికి యంగ్‌ హీరోయిన్స్‌తో జోడీ కడుతూ, మన్మధుడు పేరును సార్ధకం చేసుకుంటున్నాడు నాగార్జున. యంగ్‌ హీరో కమ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు సోనాలీ బింద్రే కూడా ఈ సినిమాలో నటించబోతోందంటూ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఏమో ఆ గాసిప్స్‌ని కూడా మన మన్మధుడు నిజం చేసేస్తాడేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS