మిల్కీ బ్యూటీ తమన్నాకి ఈ మధ్య ఏమంత కలిసి రావడం లేదు. బాలీవుడ్‌లో కంగనాకి బ్రేక్ ఇచ్చిన 'క్వీన్' సినిమా తెలుగు రీమేక్‌లో తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమా డైరెక్టర్‌కీ, తమన్నాకి మధ్య ఏవో విబేధాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తప్పుకోవడం జరిగింది. దాంతో ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇదిలా ఉంటే, తమన్నాకి లేటెస్టుగా మాస్ రాజా రవితేజ కొత్త సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. అందులో ఓ హీరోయిన్‌గా ఆల్రెడీ చందమామ కాజల్ అగర్వాల్‌ని ఎంచుకోవడం జరిగింది. ఆ రెండో హీరోయిన్‌గా తమన్నా పేరును సెలెక్ట్ చేయగా, మిల్కీ బ్యూటీ ఆ ఆఫర్‌ని కాదందని తెలుస్తోంది. అందుకు పలు కారణాలుండగా, రెమ్యునరేషన్ అసలు కారణమట అనే టాక్ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందిన తమన్నాకి ప్రస్తుతం టాలీవుడ్‌లో అంతగా క్రేజ్ లేదు.
ఈ తరుణంలో రెమ్యునరేషన్ వంకతో, మంచి ఆఫర్‌ని మిల్కీబ్యూటీ వదులుకుంటుందా? అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాకి నో చెప్పేందుకు మరో బలమైన కారణం ఉండే ఉంటుందనీ నమ్ముతున్నారు. అయితే ఇంతకీ ఈ గాసిప్‌లో నిజమెంతుంది? మిల్కీ బ్యూటీ నోరు విప్పితే కానీ ఈ గుట్టు రట్టు కాదు మరి. మరో పక్క తమన్నా, కళ్యాణ్‌రామ్‌తో నటించిన 'నా నువ్వే' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.