ప్రముఖ కథానాయిక తమన్నా ఇంట్లోనూ... కరోనా ప్రవేశించింది. తమన్నా తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తమన్నా తన ట్విటర్ ద్వారా ధృవీకరించింది. ‘‘మా అమ్మా, నాన్న గత కొద్ది రోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఉన్న వారందరమూ టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికి నెగిటివ్ వచ్చింది.
అధికారులు ఎప్పటి కప్పుడు అమ్మా,నాన్నల ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఉన్నారు. మేము కూడా ముందు జాగ్రత్త చర్యల్ని పాటిస్తున్నాము. భగవంతుడి దయ వల్ల వారు ప్రస్తుతం బాగానే ఉన్నారు. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలతో వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’’నని తమన్నా ట్విట్టర్లో పేర్కొంది. ప్రస్తుతం `సిటీమార్`లో నటిస్తోంది తమన్నా. ఈ షూటింగ్ ని త్వరలోనే మొదలెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్నా ఇప్పుడు షూటింగులకు వచ్చే పరిస్థితి లేదు. దాంతో.. `సిటీమార్` సెట్స్‌పైకి వెళ్లడం మరింత ఆలస్యం అవ్వడం ఖాయం.