నాని - సుధీర్ బాబు కథానాయకులుగా నటించిన సినిమా... `వి`. నాని 25వ సినిమా ఇది. సాధారణంగా నాని సినిమా అంటే కళ్లన్నీ నానిపైనే ఉంటాయి. తెరపై తన డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. ఈసారి సుధీర్ బాబు నుంచి నానికి గట్టి పోటీ ఎదురైంది.. `వి` సినిమాలో. ఇందులో నాని సైకోగా నటిస్తే, సైకో ఆటలు కట్టిపడేసే పోలీస్ అధికారిగా సుధీర్ బాబు కనిపించనున్నాడు.
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన డైలాగ్ డెలివరీతో, నటనతో... మెస్మరైజ్ చేస్తాడు. అయితే `వి`లో సుధీర్ బాబు పాత్ర కూడా అందుకు ధీటుగా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్‌లో తన ఎయిట్ ప్యాక్ బాడీతో షాక్ ఇచ్చాడు సుధీర్ బాబు. తనపై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు మాస్‌ని అలరిస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాతో సుధీర్ కి ఓ సరికొత్త ఇమేజ్ వస్తుందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. సుధీర్ బాడీ, తన డైలాగ్ డెలివరీ.. మాస్ పాత్రలు, యాక్షన్ కథలకు సరిగ్గా నప్పుతాయి. కాకపోతే.. ఇప్పటి వరకూ ఎవరూ సరిగా వాడుకోలేదు. ఇంద్రగంటి మాత్రం సుధీర్ ని ఈసినిమాలో పూర్తి స్థాయిలో వాడుకున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమా తరవాత.. సుధీర్ ఇమేజ్, రేంజ్ మారిపోతుందని అందరి నమ్మకం. మరి ఏం జరుగుతుందో చూడాలి.