కథానాయికల పారితోషికం కోటి, రెండుకోట్లు, మూడు కోట్లు... ఇలా కోటలు దాటుతోంది. స్టార్ హీరోయిన్ అనేసరికి... అడిగినంత ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. అయితే... ఆ హీరోయిన్‌కి హిట్లున్నాయా, లేదా? తను ఫామ్ లో ఉందా, లేదా? ఇది వరకటి జోరు చూపించగలదా, లేదా? అనేవి ప్రధాన ప్రామాణికాలు. ఇలా లెక్కలేసుకుంటే... తమన్నా ఫామ్ కోల్పోయి చాలా కాలం అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలేసిన తమన్నా, ఆ తరవాత.. ట్రాక్ తప్పింది.
ఇప్పుడు తమన్నా పేరు పరిగణలోనికి తీసుకోవడమే కష్టంగా మారింది. అలాంటిది ఓ భారీ చిత్రంలో తనని హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటే, అడిగినంత పారితోషికం పువ్వుల్లో పెట్టి ఇస్తే..? భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం భోళా శంకర్.
కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో కథానాయిక పాత్ర.. తమన్నాకి దక్కింది. చిరు సినిమాలో అవకాశం రావడం తమన్నాకు ఉపశమనం కలిగించే విషయం. కాకపోతే ఈ సినిమాకి కూడా తమన్నా గొంతమ్మ కోర్కెలు కోరిందట. భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. తమన్నా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి చిత్రబృందం అంగీకరించింది కూడా. ఈ సినిమా కోసం తమన్నాకు ఏకంగా 2 కోట్లు ఇచ్చారని టాక్. ఫ్లాపుల్లో ఉన్న తమన్నాకు 2 కోట్లంటే చాలా ఎక్కువ. ఇంతమంది కథానాయికలు ఉన్నా, తమన్నానే ఎందుకు? ఫామ్ లో లేకపోయినా, అంత పారితోషికం ఎందుకు ఇచ్చినట్టు? అంటూ టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.