మిల్కీ బ్యూటీ తమన్నా వరుసగా రెండు బిగ్ ఆఫర్స్ తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులని తనవైపుకి తిప్పుకుంది. అవే ఎన్టీఆర్ చిత్రంలో స్పెషల్ సాంగ్ అలాగే కళ్యాణ్ రామ్ తాజా చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్.
అయితే ఈ రెండు చిత్రాలకి కలిపి తనకి సుమారుగా రూ 1.50 కోట్లు రెమ్యునరేషన్ అందనున్నట్టు సమాచారం. ఒక స్పెషల్ సాంగ్+సినిమా కి కలిపి ఇంత మోత్తంలో రెమ్యునరేషన్ అందడం నిజంగా మంచి డీల్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట.
ఇక బాహుబలి చిత్రం తరువాత తను సైన్ చేసిన పెద్ద తెలుగు సినిమా డీల్ అంటే ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా నందమూరి సోదరులు ఈ మిల్కీ బ్యూటీకి మంచి ఆఫర్ ఇచ్చి మళ్ళీ తెలుగులో బిజీ అయ్యేలా చేశారు అనే చెప్పాలి.