అవసరానికి మించిన గురువు లేడు. అవసరమే అన్నీ నేర్చుకునేలా చేస్తోంది. ఈ లాక్ డౌన్ వల్ల - చాలామందికి కొత్త అవసరాలు వచ్చాయి. ఇది వరకు తెలియని కొత్త కళలను బయటపెట్టేలా చేశాయి. తమన్నాలోనూ ఓ కళ ఉందని ఈ లాక్ డౌన్ కాలమే చెప్పిందట. ఈ విషయం తమన్నానే చెప్పింది. తమన్నాకు ఇది వరకు వంట చేయడం అస్సలు రాదట. కానీ ఈ లాక్ డౌన్ సమయంలో, ఇంట్లోనే ఉండి వంట చేయడం నేర్చుకుందట. తనలో మంచి కుక్ ఉందన్న సంగతి ఈమధ్యే తెలిసిందట.
''ఇది వరకు వంట గురించి అస్సలు తెలిసేది కాదు. షూటింగుల్లో ఉన్నప్పుడు హోటెల్ ఫుడ్డే శరణ్యం. ఇంటికి వెళ్లినా ఉండేది కొద్ది రోజులే. వంట గదిలో అడుగుపెట్టినా, ఎక్కడ ఏ వస్తువు ఉందో అర్థమయ్యేది కాదు. కానీ ఈ లాక్ డౌన్ సమయంలో వంట చేయడం నేర్చుకున్నా. వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో తెలిసొచ్చింది. ఎక్కడ ఏ వస్తువు ఉందో అర్థమైంది. సామాన్లు ఎలా శుభ్రం చేసుకోవాలో అర్థమైంది. ఇప్పుడు మా ఇంట్లో నా వంటే అందరికీ నచ్చుతోంది'' అని చెప్పుకొచ్చింది తమన్నా.