‘పుష్ప’ ఫస్ట్‌ లుక్‌: ఆ ‘ఆరో వేలు’ లెక్కేంటి సుకుమార్‌?

మరిన్ని వార్తలు

సుకుమార్‌ ఒకప్పుడు లెక్కల మాస్టారు.. అందుకేనేమో, ఆయన సినిమాల్లో ‘లెక్కలు’ బాగా కన్పిస్తుంటాయి. ఇప్పుడు తన తాజా చిత్రం ‘పుష్ప’ విషయంలోనూ ఈ లెక్కల ది¸యరీ లాంటిది ఏదో వుండే వుంటుంది. లేకపోతే, అల్లు అర్జున్‌ కాలికి ఆరో వేలు వుండటమేంటి.? చాలా తక్కువమంది ఈ విషయాన్ని అజ్వర్వ్‌ చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కేవలం క్లోజప్‌నే రిలీజ్‌ చేస్తే, ఆ తర్వాత వచ్చిన లుక్‌లో లాంగ్‌ షాట్‌ని చూపించారు. దాంట్లో, అల్లు అర్జున్‌ కాలికి ఆరు వేళ్ళు వున్న విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలేంటి సుకుమార్‌ లెక్క.? అని ఆరా తీస్తున్నారిప్పుడంతా. పైగా, టైటిల్‌ లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో వేలి ముద్రలు కన్పిస్తున్నాయి. సుకుమార్‌ సినిమాలంటే టెక్నికల్‌ బ్రిలియన్స్‌తో వుంటాయి. ఆ టెక్నికల్‌ బ్రిలియన్స్‌ ఇంకాస్త ఎక్కువ స్థాయిలోనే చూడబోతున్నామట ‘పుష్ప’ సినిమాలో. ఇదిలా వుంటే, ‘పుష్ప’ టీమ్ తొందరపాటులో తప్పు చేసిందనీ, ఫొటోని మార్ఫింగ్‌ చేసే క్రమంలోనే అల్లు అర్జున్‌ కాలికి ‘ఆరో వేలు’ కన్పించిందనీ ఇంకొందరు తమకు తోచిన స్థాయిలో కథలు అల్లేస్తున్నారు. సుకుమార్‌ నుంచి సినిమా వస్తోంటే.. అందునా స్టైలిష్‌ స్టార్‌ సినిమా.. పైగా మైత్రీ మూవీ మేకర్స్‌ రూపొందిస్తున్న సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌లో తప్పులు దొర్లేందుకు ఆస్కారమే వుండదు. ఆ ‘ఆరో వేలు’ చుట్టూ పెద్ద కథే వుండి వుండాలి. అదేంటన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుందేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS