మిల్కీబ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతోందా? అంటే అవునంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దశాబ్ధ కాలానికి పైగానే గ్లామర్ తారగా అలరిస్తోంది తమన్నా. ఎన్నో ప్రెస్టీజియస్ మూవీస్‌లో నటించింది. ఈ ఏడాది 'ఎఫ్ 2' బిగ్ హిట్ తమన్నా ఖాతాలో ఉంది. తెలుగులోనే కాక, తమిళ, హిందీ భాషల్లోనూ తమన్నా పలు చిత్రాల్లో నటించింది. అయితే, ఈ మధ్య కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి తమన్నా కెరీర్.
'ఎఫ్ 2' తర్వాత తెలుగులో తమన్నా నటించిన 'సైరా' చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో పాటు, తెలుగు 'క్వీన్' - 'దటీజ్ మహాలక్మీ' కూడా విడుదల కావల్సి ఉంది. తమిళంలో విశాల్ సరసన సుందర్.సి. దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది తమన్నా. హిందీలో ఈ మధ్యనే ఓ కొత్త ప్రాజెక్ట్‌పై సైన్ చేసింది. ప్రస్తుతం ఇదీ ఆమె సినీ కెరీర్. ఇక పర్సనల్స్ వివరాల్లోకి వెళితే, తొందరలోనే తమన్నా పెళ్లి పీటలెక్కబోతోందనీ తెలుస్తోంది. హీరోయిన్స్‌పై సహజంగా వినిపించే లవ్ అఫైర్స్ లేని హీరోయిన్‌గా తమన్నా పేరు ముందు వరసలో ఉంటుంది.
ఇంత సుదీర్ఘ కాలం సినిమాల్లో కొనసాగినా, తమన్నా అలాంటి వాటికి అతీతంగా కెరీర్‌ని కొనసాగించుకుంటూ వచ్చింది. ఇక, ఇప్పుడు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పెద్దలు కుదిర్చిన పెళ్లికే తమన్నా సై అంటోందట. ఆల్రెడీ వరుడ్ని వెతికే పనిలో తమన్నా ఫ్యామిలీ బిజీ అయిపోయారట. సో మంచి వరుడు దొరికితే, త్వరలోనే తమన్నా పెళ్లి వార్త వినేస్తామన్న మాట. ఈ లోగా, ఒప్పుకున్న సినిమాల్ని కంప్లీట్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోందట తమన్నా.