'సాహో'కి ఊపొచ్చింది!

మరిన్ని వార్తలు

ఆగస్ట్‌ 30న 'సాహో' వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. సినిమాపై హైప్‌ పెంచేందుకు చిత్ర యూనిట్‌ రంగంలోకి దిగింది. అందులో భాగంగా, సినిమాలో కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. అలా బయటికొచ్చిన అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ పోస్టర్లు తాజాగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పోస్టర్స్‌ని డిజైన్‌ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది.

 

జస్ట్‌ పోస్టర్‌నే కాదు, పోస్టర్‌తో పాటు, ఆయా క్యారెక్టర్స్‌కి సంబంధించి, చిన్న హింట్‌ ఇచ్చామన్నట్లుగా, రెండు పవర్‌ఫుల్‌ డైలాగులు కూడా వదిలారు. 'అంతం అన్నింటికీ సమాధానం కాదు..' అంటూ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ పోస్టర్‌పైనా, 'బ్లడ్‌కి బ్లడీ ఇన్విటేషన్‌ అవసరం లేదు..' అంటూ అరుణ్‌ విజయ్‌ పోస్టర్‌పై డైలాగ్స్‌ వారి క్యారెక్టర్స్‌లోని పవర్‌ని ఎలివేట్‌ చేస్తోంది. ఇంకా ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్‌ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి పోస్టర్స్‌ కూడా త్వరలో రిలీజ్‌ చేయనున్నారట.

 

మొదట్లో 'సాహో ఛాప్టర్స్‌'కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తర్వాత హైప్‌ కాస్త తగ్గినట్లుగా కనిపించినా, మళ్లీ 'సాహో' పుంజుకుంది. యాక్షన్‌ మోడ్‌ నుండి, రొమాంటిక్‌ మోడ్‌లోకీ, తాజా పోస్టర్స్‌తో మరో డిఫరెంట్‌ మోడ్‌లోకీ తీసుకెళ్తూ 'సాహో'ని ప్రమోట్‌ చేస్తున్నారు. తదుపరి రాబోయే 'సాహో' సర్‌ప్రైజ్‌ ఊహించని విధంగా ఉంటుందట. అదేంటో తెలియాలంటే ఇంకాస్త ఓపిక పట్టాల్సిందే. ప్రబాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సుజిత్‌ దర్శకుడు కాగా, యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS