తమన్నా కెరీర్ కాస్త విచిత్రంగా సాగుతోంది. ఒక్కోసారి అస్సలు ఖాళీ లేనంత బిజీగా కనిపిస్తుంది. కట్ చేస్తే ఒక్కోసారి... చేతిలో సినిమాలు ఉండవు. తమన్నా పనైపోయిందా? అనుకొనే సమయంలో చటుక్కున ఓ భారీ ఆఫర్ పట్టేసి, మళ్లీ రేసులోకి వచ్చేస్తుంటుంది. ఇప్పుడూ అదే చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి `భోళా శంకర్`లో కథానాయికగా ఛాన్స్ అందుకొంది. అంతలోనే.. రజనీ నుంచి కూడా పిలుపు వచ్చినట్టు టాక్.
రజనీకాంత్ - నెల్సన్ కాంబినేషన్‌లో `జైలర్` అనే చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కథానాయికని ఇంకా ఫిక్స్ చేయలేదు. ఆ ఆఫర్ ఇప్పుడు తమన్నా ముందుకొచ్చిందని టాక్. నిజానికి ఈ సినిమా కోసం త్రిష, నయన తార లాంటి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఇప్పటికే వారిద్దరితోనూ రజనీ జోడీ కట్టేశాడు.
రజనీ పక్కన ఇప్పటి వరకూ చేయని కథానాయిక అయితే బాగుంటుందని నెల్సన్ భావించాడట. పైగా తమన్నా డేట్లు ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అందుకే తమన్నాని ఫిక్స్ చేశారని టాక్. కాకపోతే... రజనీ - తమన్నా కాంబో అంటే కాస్త ఆర్డ్ గా ఉంటుంది. ఇద్దరికీ ఎలా మ్యాచ్ అవుతుందబ్బా? అని రజనీ ఫ్యాన్స్ సైతం బుర్ర గోక్కుంటున్నారు. కాకపోతే.. ఈ జోడీ కెమిస్ట్రీ అదిరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నార్ట. రజనీ కాంత్ సినిమా అంటే ఎవరు మాత్రం ఎందుకు వద్దంటారు? తమన్నా ఈ సినిమా చేయడానికి తెగ ఉత్సాహపడిపోతోందని టాక్.