బెంగాల్ టైగర్ కోసం తొలిసారి జోడీ కట్టారు రవితేజ - తమన్నా. ఇప్పుడు ఈ జంటని మరోసారి తెరపై చూసే ఛాన్స్ దక్కబోతోంది. రవితేజ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో తమన్నా కథానాయికగా నటించబోతున్నట్టు టాక్. రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత... రమేష్ వర్మ సినిమా మొదలవుతుంది. దానికి సమాంతరంగా త్రినాథరావు నక్కిన సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.
నక్కిన త్రినాథరావు కథలన్నీ.... ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడినవే. దానికి వినోదాన్ని జోడిస్తారు. ఈసారీ అదే ఫార్ములాలో కథని అల్లుకున్నారట. అయితే అందులో మాస్ అంశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తాయని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని టాక్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.