పాపం... తమన్నాకి బొత్తిగా టైమ్ కలసి రావడం లేదు. చేతిలో సినిమాల్లేవు. ఉన్నా సరిగా ఆడడం లేదు. వెబ్ సిరీస్ చేస్తే.. అది ఫట్ మంది. ఇప్పుడు జెమినీ కోసం `మాస్టర్ చెఫ్` అనే షో చేసింది. అదీ ఫ్లాపే. దాంతో.. ఆమెని ఈ షో నుంచి అర్థాంతరంగా తొలగించి - అనసూయని తీసుకున్నారు. దాంతో.. తమన్నా ఈగో హర్ట్ అయ్యింది. నన్ను షో నుంచి తీసేస్తారా? అంటూ... షో నిర్వాహకులపై ఎగిరి పడింది. అంతే కాదు.. పారితోషికంగా తనకు ఇస్తానన్న మిగిలిన డబ్బు ఇవ్వాలని, అప్పటి వరకూ ఈ షో చేయకూడదంటూ నోటీసులు జారీ చేసింది.
అయితే `మాస్టర్ చెఫ్` యాజమాన్యం దీన్ని మరింత సీరియస్ గా తీసుకుంది. ఈ షోకోసం తమన్నాతో 2 కోట్ల ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నామని.. ఇప్పటికే 1.56 కోట్లు ఇచ్చేశామని, మరో 44 లక్షలు ఇవ్వాలని, అయితే..తమన్నా వల్ల ఈ షోకి 5 కోట్ల నష్టం వచ్చిందని దానికి తమన్నా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమన్నా 18 రోజుల డేట్లు ఇచ్చిందని, అయితే 16 రోజులే ఈ షోలో పాల్గొందని, మిగిలిన రెండు రోజులు తాను రాకపోవడం వల్ల చాలా నష్టపోయామని ముందు దానికి తమన్నా సమాధానం చెప్పాలని గట్టిగానే అడుగుతున్నారు. దాంతో తమన్నా చిక్కుల్లో పడినట్టైంది. 44 లక్షల కోసం తాను అడ్డుపడితే.. చివరికి 5 కోట్లు నా చేత కట్టిస్తారేమో..? అంటూ తమన్నా భయపడిపోతోందట. కాకపోతే.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మరి తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి.