అల్లు అర్జున్ డాన్సులకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మెలికలు తిరుగుతూ వేసే స్టైలీష్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా. ఆ డాన్సులే.. బన్నీకి తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. టాలీవుడ్ హీరోల్లోనూ.. బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నాగశౌర్య ఒకడు. `వరుడు కావలెను` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి... అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా నాగశౌర్య తన అభిమానాన్ని చాటుకున్నాడు.
''గంగోత్రి నుంచి.. పుష్ష వరకూ... అల్లు అర్జున్ ఎదిగిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. డాన్సుల్లో ఆయన్ని మించిన హీరో సౌత్ ఇండియాలోనే లేడు. ఇండ్రస్ట్రీకి వచ్చిన కొత్తలో డాన్స్ నేర్చుకోవాలని అంటే.. ఓ ఫ్రెండ్ నన్ను డాన్స్ ఇనిస్టిట్యూట్‌కి తీసుకెళ్లాడు. అక్కడ తొలిసారి బన్నీని చూశా. అక్కడ ఓ చేయి విరిగిపోయిన సరే.. డాన్సు నేర్చుకుంటూ కనిపించాడు. అప్పుడు అనిపించింది. ఇంత కష్టపడితే గానీ, అభిమానుల్ని మెప్పించలేమని. అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ అన్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ గా విన్నాను .. బన్నీగా విన్నాను .. స్టైలీష్ స్టార్ గా విన్నాను .. ఇప్పుడు ఐకాన్ స్టార్ అంటున్నారు. ఎలా ఎదిగారన్న మీరు .. నిజంగా మీకు హ్యాట్సాఫ్.'' అని బన్నీపై తనకున్న అభిమానం, ప్రేమని చాటుకున్నాడు నాగశౌర్య. తను నటించిన `వరుడు కావలెను` ఈ శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.