చిత్ర పరిశ్రమకీ గాసిప్పులకీ విడదీయరాని అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా కథానాయికల చుట్టూ గాసిప్పులు తిరుగుతుంటాయి. వాళ్ల ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు గాసిప్పులు పుట్టుకొస్తుంటాయి. వాటిలో కొన్నింటిలో నిజం ఉంటుంది కూడా. కొన్నింటిని కథానాయికలు తిప్పి కొడుతుంటారు. ఇంకొంతమంది మౌనాన్ని ఆశ్రయిస్తారు. తమన్నా మాత్రం ఎప్పటికప్పుడు తనపై వస్తున్న రూమర్లని ఖండిస్తుంటుంది. ఇటీవల తమన్నా ప్రేమ, పెళ్లిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తమన్నా ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. వాటిపై అప్పట్లోనే కౌంటర్ ఇచ్చేసింది తమన్నా. లేటెస్టుగా ఈ విషయంపై మరోసారి మాట్లాడింది.
తను ప్రేమలో పడలేదని, ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ``నా పెళ్లి విషయంలో నాకు ఎలాంటి తొందరలేదు. ఇంట్లోవాళ్లు కూడా కంగారు పడడం లేదు. మీడియా మాత్రం ఇప్పటికే రెండు మూడు సార్లు నా పెళ్లి చేసేసింది. నాకు, మా ఇంట్లో వాళ్లకూ లేని కంగారు వాళ్లకెందుకో అర్థం కావడం లేదు. పెళ్లి అనేది చాలా కీలకమైన విషయం. దాన్ని రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. నా పెళ్లి అందరికీ చెప్పే చేసుకొంటా. నాకింకా నా ఐడియల్ మెన్ దొరకలేదు`` అంటూ రూమర్లపై మళ్లీ వివరణ ఇచ్చింది. తను కథానాయికగా నటించిన `గుర్తుందా శీతాకాలం` ఈవారంలోనే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.