ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమా పాన్ ఇండియా విజయం సాధించింది. తన సినిమాల పాత్రలతోనే ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్' అంటూకొత్త ప్రపంచాన్ని సృష్టించి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా విజయ్ హీరోగా ఒక కొత్త సినిమా ప్రారంభమైయింది
గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం..‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా తెరకెక్కనుంది. గత చిత్రాలు కంటే ఈ సినిమా మరింత భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారని ప్రచారం వినిపిస్తోంది. కథానాయికగా త్రిష పేరుని పరిశీలిస్తున్నారు. విజయ్, లోకేష్ కలయికలో వచ్చిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు రాబోతున్న సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.