'సైరా'తో మిల్కీ బ్యూటీ పేరు కాస్తా 'లక్ష్మీ'గా మారిపోయింది. లక్ష్మి పాత్రలో తమన్నా పేరు అంతలా మార్మోగిపోతోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ తమన్నాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సినిమాలో ఆమె పర్‌ఫామెన్స్ అలా ఉంటే, ఇక సినిమాకి సంబంధించిన ప్రతీ ప్రమోషన్‌లోనూ తమన్నా ముందుంటూ, ఆ కార్యక్రమానికి తరగని అందం తీసుకొస్తోంది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ, సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతోంది.
సినిమాలో నటించడం ఓ ఎత్తు, ప్రమోషన్స్‌లో కనిపించడం ఇంకో ఎత్తు. ఆ రకంగా డబుల్ మార్కులు కొట్టేస్తోంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇక ఈ రోజే తీసుకుంటే, తమన్నా ఓ వైపు గోపీచంద్‌తో నటిస్తున్న చిత్రం ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యింది. ఆ తర్వాత 'సైరా' థాంక్స్ మీట్‌లో తళుక్కున మెరిసింది. లక్ష్మి పాత్రలో కనిపించాక, తమన్నాలో తెలియని హుందాతనం ఉట్టిపడుతోంది. ఆ హుందాతనానికే ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరూ తమన్నా క్యారెక్టర్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 'బాహుబలి'లో అవంతికా రాకుమారి పాత్ర గురించి విడుదలకు ముందు చాలా ఎక్కువగా చెప్పుకున్నారు.
కానీ, విడుదలయ్యాక తమన్నా పాత్రకు చెప్పుకున్నంత సీను లేదని తీసి పారేశారు. కానీ, 'సైరా' విషయంలో రివర్స్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందు నయనతారను మాత్రమే మెయిన్ లీడ్ హీరోయిన్‌గా ప్రమోట్ చేసి, తమన్నాని గెస్ట్ అప్పియరెన్స్‌గా కౌంట్ చేశారు. కానీ సినిమా విడుదలయ్యాక తెలిసింది.. తమన్నా పర్‌ఫామెన్స్, ఇంపార్టెన్స్ ఎలాంటివో. నిజానికి తమన్నానే 'సైరా'కి హీరోయిన్ అనేంతలా ఆమె క్యారెక్టర్ ఎలివేట్ అవుతోంది.