అక్కినేని రాకుమారుడు అఖిల్ స్పీడు పెంచాడు. ఇంతవరకూ నాలుగు సినిమాల్లోనే నటించినా, ఒక్కో సినిమాకీ చాలా చాలా గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. అయితే, ఇకపై ఆ గ్యాప్ ఫిల్ చేయాలనుకుంటున్నాడట. దాంతో ఓవర్ స్పీడ్ పెంచాడనీ తెలుస్తోంది. ఆల్రెడీ బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా సెట్స్‌పై ఉంది. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాకుండానే, ఇంకో సినిమాని కూడా లైన్లో పెట్టేశాడట.
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్‌తో అఖిల్ తదుపరి చిత్రం ఉండబోతోందనీ తెలుస్తోంది. అఖిల్ కోసం అదిరపోయే లవ్ స్టోరీని ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట పరశురామ్. పరశురామ్ ఖాతాలో ఆల్రెడీ రెండు మంచి హిట్స్ ఉన్నాయి 'శ్రీరస్తు శుభమస్తు', 'గీత గోవిందం' సినిమాలతో. సో పరశురామ్ మీద పూర్తి నమ్మకంతో నాగార్జున అఖిల్‌ని ఆయన చేతిలో పెట్టాడట.
ఆల్రెడీ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతోనే అఖిల్ ఈ సారి హిట్ కొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అందులోనూ పూజా రూపంలో లక్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది అఖిల్ కెరీర్‌కి. సో ఇక ఫామ్‌లోకి రావడమే తరువాయి. అఖిల్ ఆశించిన ఫామ్ ఈ సారి పక్కా అయితే, ఇక తదుపరి సినిమాలపై అంచనాలు క్రియేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.