బిగ్‌బాస్‌ హీరో మహేష్‌ అన్న తమన్నా.

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో తన జర్నీని 'ఉగాది పచ్చడి'గా అభివర్ణించింది తమన్నా సింహాద్రి. ఈ ఛాన్స్‌ తనలాంటి వాళ్లకు ఎంతో గొప్ప ప్లాట్‌ఫామ్‌ అని చెప్పుకొచ్చింది. ఇక హౌస్‌లో ఒక్కొక్కరి గురించి తనదైన శైలిలో అభిప్రాయాల్ని పంచుకుంది. మహేష్‌ని బిగ్‌బాస్‌ హీరో అని చెప్పింది. ఆయన బయటా, ఇంట్లోనూ కూడా గుడ్‌ పర్సనే అని తమన్నా చెప్పింది. ఆలీని అయితే, వెనకా ముందూ చూడకుండా, విలన్‌ అనేసింది. శ్రీముఖిని ఆడపులి అని అభివర్ణించింది.

 

హౌస్‌లో డే వన్‌ నుండీ, తనతో రియల్‌ ఫ్రెండ్‌షిప్‌తో ఉన్న వ్యక్తి శ్రీముఖి అనీ, ఇక బాబా బాస్కర్‌ అయితే, తనకు తల్లి, తండీ, గురువు అన్నీ అని బాగా ఎమోషన్‌ అయ్యింది. వరుణ్‌ సందేశ్‌ని అమాయకుడు అనీ, బయటి నుండి చూసిన వరుణ్‌ సందేశ్‌కీ, హౌస్‌లో వరుణ్‌ సందేశ్‌కీ చాలా తేడా ఉందని చెప్పింది. పెళ్లాం చేతిలో వరుణ్‌ కీలు బొమ్మ అని చెప్పింది. వితికాని పుల్లలు బాగా పెడుతుంది అని చెప్పింది. ఆషూ రెడ్డికి బిగ్‌బాస్‌ అంటే ఏంటో అసలే తెలీదు. ఏదో అలా పిక్‌నిక్‌కి వచ్చినట్లుగా ఆమె హౌస్‌లో ఉందంతే.

 

గేమ్‌ ఆడే ఆటిట్యూడ్‌ ఆమెలో ఇసుమంతైనా లేదు అని తమన్నా చెప్పుకొచ్చింది. రవిని స్పెషల్‌గా ట్రీట్‌ చేసింది తమన్నా. అయితే, ఎందుకో రవి నుండి తాను ఎక్స్‌పెక్ట్‌ చేసినవి అందకపోయేసరికి సడెన్‌గా ప్లేట్‌ మార్చేసింది. రవి పట్ల రాక్షసిలా ప్రవర్తించింది. హౌస్‌ నుండి బయటికొచ్చేస్తూ కూడా, రవిని క్షమించలేదు. వెళ్లిపోతుంది కదా, తమ మధ్య ఉన్న గొడవలు సెటిల్‌ చేసుకుని ఓ హగ్‌ తీసుకుందామని వచ్చిన రవిని లైట్‌ తీసుకుంది తమన్నా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS