చరణ్, ఎన్టీఆర్ ల విలన్ కన్నుమూత

మరిన్ని వార్తలు

సౌత్ ఇండస్ట్రీకి చెందిన డానియల్ బాలాజీ శుక్రవారం రాత్రి హార్ట్ స్ట్రోక్ తో మరణించారు. ఈయన మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణ నటుడిగా పేరు పొందిన డానియల్ విలన్ గా తమిళ్ , తెలుగు , మళయాళ భాషల్లో మొత్తం 50కి పైగా సినిమాల్లో  నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డానియల్ యాక్టింగ్‌లోకి రాకముందు సినిమాలకి యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేశారు. ఆ తర్వాత రాధిక నటించిన 'చిత్తి' అనే తమిళ సీరియల్‌ తో యాక్టర్‌గా మారాడు. ఇదే తెలుగులో 'పిన్ని' పేరుతో డబ్ అయింది. నెక్స్ట్  'ఏప్రిల్ మ‌దాతిల్' అనే సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు బాలాజీ.


2004 లో వచ్చిన ఎన్టీఆర్ సాంబ సినిమాతో  టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు డానియల్. తరవాత అదే ఏడాది వెంకటేష్ నటించిన ఘర్షణ మూవీలో పోలీస్ ఆఫీసిర్ గా, వెంకటేష్ ఫ్రెండ్ గా నటించి మెప్పించారు. ఘర్షణ మూవీలో డానియల్ తన నటనతో బాగా మెప్పించాడు. రామ్ చరణ్ చిరుత సినిమాలో విలన్ గా నటించాడు. తమిళంలో కమల్ హాసన్ సినిమా 'రాఘవన్' మూవీలో సైకోగా అద్భుత నటన కనపరిచి, విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఈ మూవీతో మంచి గుర్తింపు పొందాడు. తెలుగులో చివరగా  నాని “టక్ జగదీష్” మూవీలో  మెయిన్ విలన్ గా నటించాడు.


మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని డానియల్ ఇలా అకాలమరణం చెందటంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 48 ఏళ్ళ వయసులో గుండె పోటు కారణంగా మరణించటం విషాదంగా మారింది. శుక్రవారం రాత్రి డానియల్ కి హార్ట్ స్ట్రోక్ రావటం తో చెన్నై లోని కొట్టివాకమ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స అందిస్తుండగా  ఆయన కనుమూశారు.

ALSO READ : REVIEW IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS