జల్లికట్టు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం రోజురోజుకి పెద్దదిగా మారుతుంది. తమిళనాట ప్రతిఒక్కరు ఈ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా సినీపరిశ్రమ ముందునుండి దీనికి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. అయితే వారు ఈ రోజు తమ నిరసనని మౌన దీక్ష ద్వారా తెలియచేయనున్నారు. దీనికి స్టార్ హీరోలు రజినీకాంత్, అజిత్, సూర్య, విశాల్ మొదలుకొని ప్రముఖులు అందరు పాల్గొంటున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అందరు నల్ల చొక్కలతో తమ నిరసన తెలియచేస్తున్నారు. అలాగే తమిళ సినీపరిశ్రమ కూడా జల్లికట్టుకి మద్దతుగా ఈరోజు షూటింగ్లకు, థియేటర్లకు సెలవు ప్రకటించేసారు. మొత్తంగా చూస్తే జల్లికట్టుకి అన్ని వర్గాలనుండి మద్దతు లబిస్తుంది. ఈరోజు ఇంకేం మలుపు తిరగుతుందో చూడాలి ఈ జల్లికట్టు ఉద్యమం.
ALSO SEE :
Qlik Here For Tamil Actors At Protest