రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుత ప్రయోగం చేయబోతున్నారు. 'బాహుబలి' వంటి ఓ ఫాంటసీ మూవీకి కథనందించడమే కాకుండా, బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'బజరంగీ భాయిజాన్' వంటి క్లీన్ ఎంటర్‌టైనింగ్ మూవీకి కథనందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అయితే తాజాగా ఈయన తెలుగు తెరపై ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీవల్లీ'. ఇదో డిఫరెంట్ శృంగారాత్మక చిత్రం. మామూలుగా ఇలాంటి ఔట్ డోస్ రొమాంటిక్ చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి. అలాంటి వాటన్నింట్లోనూ ఇదో కొత్త కాన్సెప్ట్ అట. ఎరోటిక్ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రజిత్, నేహా హింగే ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఈ చిత్రం ఆడియో వేడుకలు ఈ నెల ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా జరగనున్నాయి. ఇంతవరకూ ఎన్నో థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు. ఈ సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు మరో ఎత్తు. ఒక మనిషి మనసుని చదవగలిగితే కలిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది చాలా ఆశక్తికరంగా డైరెక్టర్ ఈ సినిమాలో చూపించారట. ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినిమా అత్యద్భుతం కానుందంటున్నారు. శృంగారాత్మక చిత్రమే అయినప్పటికీ, అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే విధంగా ఈ సినిమాని తెరపై ఆవిష్కరించారట. మొత్తానికి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈ తరహా నేపధ్యంలో సినిమా తెరకెక్కడం అనేది శోచనీయమే. ఈ ప్రయోగం ఎంతవరకూ వర్కవుటవుతుందో చూడాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే!