పైరసీ కి అడ్డుకట్ట వేసినట్టేనా?

మరిన్ని వార్తలు

ఒప్పుడు కొత్త సినిమా, లేదా హిట్ సినిమా చూడాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు సినిమా థియేటర్స్ లో ఉండగానే నెట్ లో దర్శనమిస్తోంది. కారణం పైరసీ వీరులు పోటా పోటీగా నిర్మాతల కష్టాన్ని దోచేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ పైరసీ కి చిక్కి పలువురు నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంత హిట్ సినిమా అయినా కొన్ని వారాల్లోనే కనుమరుగవటానికి కారణం పైరసీ అనే చెప్పాలి. ఈ పైరసీ లో రికార్డ్ క్రియేట్ చేసింది తమిళ్ రాకర్స్. ఈ పేరు వింటేనే ఇండస్ట్రీ ఉలిక్కి పడుతోంది. నిర్మాతలకు పబ్లిక్ గా సవాల్ చేసి మరీ వచ్చిన రోజే సినిమాని పైరసీ చేసి ఆన్ లైన్ లో పెడుతున్నారు. 


ఈ పైరసీ భూతం 'తమిళ్‌ రాకర్స్ అడ్మిన్‌' ను అరెస్ట్‌ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ అడ్మిన్ ఎక్కడ నుంచి సినిమాలు అప్ లోడ్‌ చేస్తున్నాడో కనిపెట్టినా కూడా అరెస్ట్‌ చేయడం వీలు కాలేదు. ఇన్నాళ్ళకి పోలీసులు విజయం సాధించారు. తమిళ్‌ రాకర్స్ అడ్మిన్‌ 'జెఫ్‌ స్టీఫన్ రాజ్' ను రెడ్ హ్యాండెడ్ గా కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధనుష్ మూవీ'రాయన్‌'ను తిరువనంతపురంలో ఒక థియేటర్ లో మొబైల్‌ ద్వారా రికార్డ్‌ చేస్తున్న జెఫ్ స్టీఫన్‌ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రీసెంట్ గా మలయాళ హీరో పృథ్వీరాజ్ 'గురువాయూర్ అంబల నడయిల్' సినిమా రిలీజ్ రోజే పైరసీ చేసి తమిళ్ రాకర్స్ లో ఉంచటంతో  పృథ్వీరాజ్ భార్య కంప్లైంట్ చేశారు. ఈ పిర్యాదు ఆధారంగా ఆపరేషన్ చేపట్టిన కేరళ పోలీసులు స్టీఫన్ రాజ్ ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.  


స్టీఫన్ రాజ్ అరెస్ట్ తో పైరసీ ఆగిపోతుందా? అన్న ప్రశ్న పలువురిలో తలెత్తుతోంది. పైరసీ చేస్తున్నవారిలో ఇతను కీలకం కానీ మొదటి వాడు, చివరివాడు కాదన్న సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఈజీగా పైరసీ చేసి, ఇండస్ట్రీ ని ముప్పు తిప్పలు పెడుతున్నవారు చాలా  మంది ఉన్నారు. మరి కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని, పైరసీ భూతాన్ని అరికట్టాలని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS