విజయశాంతి తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదు అని చెప్పక తప్పదు. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ బచ్చన్, లేడీ మెగాస్టార్ లాంటి ఎన్నెన్నో బిరుదుల్ని విజయశాంతి సొంతం చేసుకున్నారు. ఆమె చేసిన సినిమాలు అటువంటివి. హీరోలతో పోటీ పడి వెండితెరపై యాక్షన్ సీక్వెన్సెస్‌లో విజయశాంతి నటించారు. ఆమె బాటలో ఇంకొందరు హీరోయిన్లు అటువంటి సాహసాలు చేసినా విజయశాంతాలా మెప్పించలేకపోయారు. అయితే స్టార్‌డమ్ పరంగా చూసుకున్నప్పుడు అనుష్క ఇప్పుడున్న హీరోయిన్లలో ఆ స్థాయికి దగ్గరగా ఉంటుందనడం నిస్సందేహం. ఇంకో వైపున అంతకు మించిన స్టార్‌డమ్ నయనతారకు లభించిందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విలక్షణ చిత్రాలు ఎంచుకుంటూ దూసుకెళుతున్న నయనతార స్టార్‌డమ్ ప్రముఖ హీరోలనే ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో సినిమాలు తగ్గించేసిన నయనతార తమిళంలో మాత్రం స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. నయనతార కొత్త సినిమా 'డోర' విడుదల సందర్భంగా నిలువెత్తు కటౌట్లతో ఆమెను గౌరవించుకున్నారు ఆమె అభిమానులు. సూపర్ స్టార్ రజనీకాంత్ తరహాలో అతి పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి, వాటికి పాలాభిషేకాలు చేయడం జరిగింది. దాంతో తమిళనాడులో ఇప్పుడందరూ లేడీ సూపర్ స్టార్ నయనతార అని కొనియాడుతుండడం జరుగుతోంది. 3 కోట్లకు పైగా ఆమె రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారమ్.