తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు- విశాల్.
అయితే నడిగర్ సంఘం విషయమై నటుడు శరత్ కుమార్ తో వివాదం మొదలయిన నాటి నుండి విశాల్ పేరు తెరపైకి వచ్చింది. చివరికి శరత్ కుమార్ వర్గాన్ని ఎన్నికల్లో ఓడించడం వల్ల తన సత్తా ఏంటో అందిరికి తెలియచేశాడు.
ఇక నిన్న జరిగిన తమిళ చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో విశాల్ అధ్యక్షుడిగా పోటీ చేసి 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఇప్పటికే నడిగర్ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు.
మరి విశాల్ చెప్పినట్టుగా తమిళ చిత్రపరిశ్రమలో మార్పు తీసుకువస్తాడా లేదా అనేది భవిష్యత్తే చెప్పాలి.