టాలీవుడ్ ఈ ఏడాది హిట్ కొట్టినట్టే అని తమ్మా రెడ్డి వ్యాఖ్యానించారు. చాలా సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి అన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోలు సినిమాలు కొన్ని అంచనాలను అందుకోలేకపోయాయయని, అయినా టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 'ఎన్నో అంచనాలతో వచ్చిన ప్రభాస్ ‘ఆది పురుష్’ మూవీ అంతా ఫెయిల్యూర్ అంటున్నారు కాని, ఈ రోజుల్లో సినిమా విజయాన్ని నిర్ణయించేది కలక్షన్స్ కదా ఆ రకంగా ఆది పురుష్ కూడా ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆల్ ఇండియా టాప్ మూవీస్ రికార్డులలో ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. చండాలంగా తీసి అంచనాలకు అనుకూలంగా ఆడలేదని చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా ఫెయిల్యూర్ అనడం కంటే కాస్ట్ ఫెయిల్యూర్ అనడం కరెక్ట్ అవుతుంది' అన్నారు తమ్మారెడ్డి.
ఏజెంట్’ , భోళాశంకర్, ‘రావణాసుర’ మూవీస్ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయని, గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ మీద అసలు అంచనాలే లేవని, అందుకే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిందన్నారు. ‘స్కంధ’ విషయంలోనూ కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యిందన్నారు. రామ్ కి ఉన్న మార్కెట్ ను బేస్ చేసుకుని బోయపాటి ఖర్చు పెట్టాలి కానీ, బాలయ్యకు పెట్టినంత బడ్జెట్ పెట్టడం వలన నష్టం జరిగింది అన్నారు.
"కథ మీద ఫోకస్ పెట్టి సినిమాలు తీస్తే మంచి విజయాలు సాధిస్తాం అనటానికి ఉదాహరణ ‘బేబీ’. ఏకంగా 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. పెద్ద హీరోలు కథ లేకపోయినా, కొత్తదనం లేకపోయినా డబ్బులు వచ్చేస్తాయని సినిమాలు చేసేస్తున్నారు. సబ్జెక్ట్ లేకుండా హిందీ డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ తో డబ్బులు వస్తాయనే ఆలోచనతో తీసి కొన్ని సార్లు ఫెయిల్యూర్ లు మూటగట్టుకుంటున్నార"ని తమ్మారెడ్డి వాపోయారు.