ఎవరిని పడితే వారిని నోరుంది కదా అని నోటికొచ్చినట్లు బూతులు తిడితే ఎవరు ఊరుకుంటారు? రకుల్ ప్రీత్‌సింగ్‌ని తిట్టేందుకు ఈమెకి ఎవరిచ్చారు హక్కు అంటూ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, శ్రీరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
తెలుగులో సినిమాలు చేయడం ఆమె తప్పా? ఆమెను ఎంచుకున్న వారిని వెళ్లి అడగమనండి.. అని ఫైర్ అయ్యారు. రకుల్ ప్రీత్‌సింగ్‌ని చెప్పు తీసి కొట్టే హక్కు ఈమెకి ఎవరిచ్చారు? అంటూ తమ్మారెడ్డి శ్రీరెడ్డిపై చిర్రుబుర్రులాడారు. అలాగే కాస్టూమ్స్ విషయంలోనూ ఆయన స్పందించారు. సాంప్రదాయ దుస్తులే వేసుకోవాలి అనే రూలేమీ లేదు. ఎవరి శరీరానికి కంఫర్ట్‌గా ఉండే దుస్తులు వారు వేసుకుంటారు. అందులో ఎవరినీ ఎవరం ప్రశ్నించలేము.
సినిమాల్లోనే పొట్టి పొట్టి దుస్తులు వేసుకుంటున్నారా? సమాజంలో అమ్మాయిలు వేసుకుని తిరగడం లేదా? కాలేజీ అమ్మాయిలు ప్యాంట్లు వేసుకుంటున్నారు. పబ్‌లకు వెళ్లే అమ్మాయిలు షార్ట్‌లు వేసుకుంటున్నారు. ఆయా దుస్తులు వారికి కంఫర్ట్‌గా ఉంటున్నాయి. కాదు చీరలే కట్టుకెళ్లా అని ఆ విషయంలో మనం ఎలా రూల్ పెట్టగలం అని మీడియాని ప్రశించారు తమ్మారెడ్డి భరద్వాజ.
కాస్టింగ్ కౌచ్ లేదని అనడంలేదు. కానీ ఆ పేరుతో లైవ్‌లో కూర్చొని నోటికి వచ్చినట్లు ఎవరిని పడితే వారిని తిట్టడం సబబు కాదని శ్రీరెడ్డిని ఉద్దేశించి తమ్మారెడ్డి అన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద కొందరు పనిగట్టుకుని కావాలనే బురద చల్లుతున్నారు. మీడియా సంయమనం పాటించాలి అని ఆయన సూచించారు.