'అద్భుతః... అనిపిస్తారా?!

By Gowthami - December 16, 2019 - 15:05 PM IST

మరిన్ని వార్తలు

'సిరా' లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా మారారు త‌నికెళ్ల భ‌ర‌ణి. 'మిథునం' తీసి విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆ త‌ర‌వాత మెగాఫోన్ జోలికి వెళ్ల‌లేదు. ఇప్పుడు మ‌రోసారి `యాక్ష‌న్‌...కట్‌` చెప్పేశారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందింది. దీనికి `అద్భుతః` అనే పేరు కూడా పెట్టేశారు. గ‌ప్ చుప్‌గా షూటింగ్ జ‌రిగిపోయింది.

 

ప్ర‌స్తుతం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 5 పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థ ఇది. భ‌ర‌ణి కూడా ఓ పాత్ర పోషించారు. 'మిథునం' నిర్మాత‌లే ఈ చిత్రాన్నీ తెర‌కెక్కించారు. భ‌ర‌ణి గ‌త చిత్రాల్లానే క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌కు అతి దూరంగా.. ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా మ‌లిచార‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS