తనీష్‌ ఆర్మీ కౌంటర్‌ షురూ.!

మరిన్ని వార్తలు

కౌషల్‌ ఆర్మీకి పోటీగా ఇప్పుడు తనీష్‌ ఆర్మీ కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బుల్లితెర బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌ అయిన కౌషల్‌ మోడల్‌గా, బుల్లితెర నటుడిగా చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అయితే ఆయన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక 'కౌషల్‌ ఆర్మీ' పేరుతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చ కారణంగా కౌషల్‌కి ఇంత ఫాలోయింగ్‌ ఉందా అనిపించేంత ఆశ్చర్యం కలిగించింది. 

ఇంతవరకూ బిగ్‌బాస్‌కి సంబంధించి కౌషల్‌ ఆర్మీ పేరుతో కౌషల్‌కి వ్యతిరేకంగా బిగ్‌హౌస్‌లో ఏం జరుగుతున్నా సోషల్‌ మీడియాలో వారిని ఓ ఆట ఆడేసుకుంటోంది ఈ కౌషల్‌ ఆర్మీ. ఇటీవలే కౌషల్‌కి మద్దతుగా ఈ ఆర్మీ హైద్రాబాద్‌లో 2కె రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంట్రీ ఇచ్చిన తనీష్‌ ఆర్మీ, 5కె రన్‌ పేరుతో కౌషల్‌ ఆర్మీకి గట్టి కౌంటరే ఇచ్చింది. గత 92 రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో క్లైమాక్స్‌కి దగ్గర పడింది. 

మరో రెండు వారాల్లో ముగియనున్న ఈ రియాల్టీ షో చివరి దశకు చేరుకునే సరికి మరింత ఉత్కంఠగా మారింది. హౌస్‌లో డే వన్‌ నుండీ కౌషల్‌కి వ్యతిరేకంగానే మిగిలిన కంటెస్టెంట్స్‌ బిహేవియర్‌ ఉండడాన్ని ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తనీష్‌ మొదట్నుంచీ కౌషల్‌కి యాంటీనే. 

తాజాగా ఆ కోవలో సెకండ్‌ ప్లేస్‌కి చేరుకుంది గీతా మాధురి. న్యూట్రల్‌గా ఉండే దీప్తి కూడా కౌషల్‌కి వ్యతిరేకంగా మారిపోయింది. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే కంటెస్టెంట్స్‌గా ఉన్న బిగ్‌బాస్‌ షో క్లైమాక్స్‌ ఫైట్‌ చాలా చాలా ఉత్కంఠని కలిగించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS