తనీష్-శ్యామల మధ్య నామినేషన్ చిచ్చు

By iQlikMovies - August 14, 2018 - 17:28 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సోమవారం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది. అయితే ప్రతి వారం ఒకేలా కాకుండా ఒక్కోవారం ఒక్కో లాగా నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది.

అందులో భాగంగానే నిన్న ఒక వినూత్నమైన రీతిలో ఈ వారానికి సంబంధించిన నామినేషన్లు ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియలో ఇంటి కెప్టెన్ అయిన కారణంగా తనీష్ కి ఇంటిలోని ఒక సభ్యుడిని నామినేట్ చేసే అధికారం ఇవ్వడంతో ఆయన శ్యామల పేరుని చెప్పడంతో ఆమె ఈ వారానికి సంబంధించిన నామినేషన్లు లిస్టులో చేరింది.

అయితే శ్యామల పేరుని తనీష్ ఎందుకు చెప్పాడు అని ఇంటి సభ్యులు అడగగా- ఒకసారి ఎలిమినేట్ అయ్యాక మళ్ళీ ప్రజల సపోర్ట్ తో ఇంటిలోకి మళ్ళీ రావడం అదే సమయంలో వేరే ఇంటి సభ్యులు శ్యామల కన్నా ఎక్కువ రోజులు ఇంట్లో గడపడమే ముఖ్య కారణాలుగా చెప్పుకొచ్చాడు.

అయితే ఈ వివరణతో శ్యామల అంతగా సంతృప్తి చెందినట్టుగా కనపడలేదు. మరి ఈ నామినేషన్ చిచ్చు వీరి మధ్య ఎలాంటి విబేధాలకి దారీతీస్తుందో అన్నది వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS