అప్పుడప్పుడు హీరోలు తాము వదిలేసుకున్న సినిమాలు సూపర్ హిట్ అవుతే ఎంత భాదపడతారో అదే స్థాయిలో ఆ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అంతగా ఆనందపడతారు.
ఇప్పుడు చరణ్-ఎన్టీఆర్ లు దాదాపు ఇలా ఆనంద పడే స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. కారణం మొన్ననే విపరీతమైన అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్ కన్నా ముందుగా ఈ ఇద్దరి హీరోలలో ఒకరు హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారట.
ఎన్టీఅర్ కి కథ కూడా వినిపించారట అయితే ఆయన నుండి ఆశించిన సమాధానం రాకపోయేసరికి తరువాత రామ్ చరణ్ ని కూడా హీరోగా తీసుకుందామనుకుని చివరికి నితిన్ ని తీసుకున్నారట. దీనితో ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఒక పెద్ద ఫ్లాప్ నుండి బయటపడినట్టయింది.
ఏదేమైనా.. ఇలా అనుకోకుండా ఒక ఫ్లాపు నుండి బయటపడడం నిజంగా లక్ అనే చెప్పొచ్చు.