ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై హీరోయిన్ తనూశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణల్లో భాగంగా కొందరు తనూశ్రీకి మద్దతు పలకగా, మరికొందరు నానాపటేకర్‌కి అండగా నిలిచారు.
ఆ క్రమంలో బాలీవుడ్ హాట్ ఐటెంబాంబ్ రాఖీసావంత్, తనూశ్రీని తప్పు పడుతూ, నానా పటేకర్ చాలా మంచోడు అంటూ కితాబిచ్చింది. అంతే కాదు, తనూశ్రీని తప్పుపట్టడంలో ఆమె కొంత దూకుడు వ్యవహరించింది. తనూశ్రీకి పిచ్చి పట్టిందనీ, గత పదేళ్లుగా కోమాలో ఉందనీ, ఇప్పుడే కోమా నుండి బయటికి వచ్చిందనీ, అవకాశాలు లేక, డబ్బులు కోసం, పబ్లిసిటీ కోసమే ఇలా నానా పటేకర్‌పై ఆనవసర ఆరోపణలు చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యలకు స్పందించిన తనూశ్రీ దత్తా, రాఖీ సావంత్‌పై పరువు నష్టం దావా వేస్తూ లీగల్‌గా సవాల్ చేసింది. అయినా రాఖీ సావంత్ ఏమాత్రం తగ్గలేదు. తనూశ్రీ చెప్పేదంతా అబద్దమనీ, ఒకవేళ ఆ ఆరోపణలకు ఆధారాలుంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలనీ, ఆరోపణలు నిజమని తేలితే, తాను ఇండియా వదిలిపోతానని తనూశ్రీపై ఎదురు దాడి చేసింది. ఇలా సవాల్, ప్రతి సవాళ్ల నడుమ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బాలీవుడ్ హాట్ టాపిక్‌గా నిలిచారు.
రాఖీసావంత్ ఏ విషయంపై స్పందించినా అదో పెద్ద సంచలనమే అవుతుంటుంది. అలాగే ఇప్పుడు తనూశ్రీ దత్తా వ్యవహారంలోనూ చేస్తోంది. ఇంతకీ పదేళ్ల క్రితం 'హారన్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఐటెం సాంగ్ చిత్రీకరణ సమయంలో జరిగిన ఈ లైంగిక ఆరోపణల పర్వం ఏదైతే ఉందో ఆ సిట్యువేషన్‌కీ రాఖీసావంత్‌కీ సంబంధం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న కారణాల రీత్యా తనూశ్రీ దత్తా ఆ సాంగ్ నుండి తప్పుకుంటే ఆ ఛాన్స్ రాఖీసావంత్ అంది పుచ్చుకుంది మరి.