నందమూరి తారక రాముడి స్టైలింగ్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

ఇప్పుడంటే పూటకో స్టైల్‌ మారిపోతోంది. కానీ అప్పుడలా కాదు. ఒక స్టైలింగ్‌తో ఎన్టీఆర్‌ వచ్చాడంటే కొన్నాళ్లపాటు ఆ స్టైలింగ్‌ని అందరూ ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టైల్‌ అప్పట్లో ఓ పెను సంచలనం. ఇప్పటి జనరేషన్‌ కుర్రాళ్లకు తమ తాతల్ని, తండ్రుల్నో పాత ఫోటోల్లో చూస్తే, అదే స్టైలింగ్‌తో కనిపిస్తారు. 

మాట, పాట, వేషధారణ ఇలా ప్రతీదానినీ ఇమిటేట్‌ చేసేవారు. అలాంటి ఎన్నో ప్రత్యేకతల్ని 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ద్వారా చూపించబోతున్నారట. ఎన్టీఆర్‌ 'కథానాయకుడు'లో ఇలాంటి అంశాలకు దర్శకుడు క్రిష్‌ పెద్ద పీట వేశాడు. సినీ కథా నాయకుడిగా ప్రేక్షకులపై ఎన్టీఆర్‌ ఎంతటి బలమైన ముద్ర వేశాడో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. 

ఆ స్టైల్‌ని ఇప్పుడు ఇమిటేట్‌ చేస్తే చాలా మందికి కామెడీగా అనిపించొచ్చు. కానీ అప్పట్లో అదో అద్భుతం. పైన కనిపిస్తున్న ఈ స్టిల్‌ ఎన్టీఆర్‌ నటించిన 'వేటగాడు' సినిమాలోనిది. అప్పట్లో సంచలన విజయం అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్‌ సన్నివేశాలను ఇప్పుడు బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో చూపించబోతున్నారు. 

తాజాగా రిలీజ్‌ అయిన ఈ స్టిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా ఆ కాలం నాటి జనరేషన్‌ వాళ్లు ఈ స్టిల్‌కి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. అన్న ఎన్టీఆర్‌ దివి నుండి భువికి దిగి బాలయ్య రూపంలో మళ్లీ ఇలా కళ్లముందుకొచ్చాడా.? అన్నట్లుగా ఉందని ఫీలవుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS