ఇంతటితో తాప్సీ 'గేమ్‌ ఓవర్‌'!

మరిన్ని వార్తలు

క్యూట్‌భామ తాప్సీ ఇప్పుడు చాలా మెచ్చూర్డ్‌ అయిపోయింది. సౌత్‌లో ఉన్నంత కాలం క్యూట్‌ అప్పీల్‌ ఇస్తూ, గ్లామర్‌ డాళ్‌గా మాత్రమే చెలామణీ అయిన తాప్సీ, ఎప్పుడయితే బాలీవుడ్‌లో అడుగుపెట్టిందో, ఆశ్చర్యకరంగా టర్న్‌ అయిపోయింది. మోస్ట్‌ వాంటెడ్‌ టాలెంటెడ్‌ గాళ్‌ అనిపించుకుంటోంది. అతి తక్కువ టైంలోనే అక్కడ తనదైన స్టార్‌డమ్‌ దక్కించుకుంది. ముఖ్యంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ ఆడ్రస్‌గా నిలిచింది తాప్సీ. అక్కడ వచ్చిన క్రేజ్‌ని ఆ తర్వాత సౌత్‌లో కూడా యూజ్‌ చేసుకుంటోంది. అడపా దడపా సినిమాలు చేస్తూ తన టాలెంట్‌ని సరికొత్తగా సౌత్‌ ప్రేక్షకులకు రివైండ్‌ చేస్తోంది.

 

ఇక తాజాగా తాప్సీ సౌత్‌లో నటించిన 'గేమ్‌ ఓవర్‌' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న ఈ తరుణంలో తాప్సీ 'గేమ్‌ ఓవర్‌' మూవీకి పోజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. హాలీవుడ్‌ తరహా స్క్రీన్‌ప్లేతో ఫాస్ట్‌గా పరుగులు పెట్టిస్తుందట గేమ్‌ ఓవర్‌. వీడియో గేమ్స్‌ డిజైన్‌ చేసే అమ్మాయి పాత్రలో తాప్సీ నటిస్తోంది ఈ సినిమాలో. ఓ యాక్సిడెండ్‌ కారణంగా కాలు విరిగి, వీల్‌ ఛైర్‌కి పరిమితమైన తాప్సీకి గేమ్‌లో మాదిరి ఆ ఇంట్లో, ఎదురైన ప్రమాదరకమైన సంఘటన నుండి గేమ్‌తోనే ఎలా తప్పించుకుందనే కథాంశాన్ని ఆశక్తికరంగా తెరకెక్కించారు.

 

అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. శశికాంత్‌ నిర్మాత. తాప్సీకి బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ సినిమాని హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నిర్మాత శశికాంత్‌ తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తాప్సీ 'శాండ్‌ కీ ఆంఖ్‌', 'మిషన్‌ మంగళ్‌' తదితర చిత్రాల్లోనూ నటిస్తోంది. తదుపరి సౌత్‌ సినిమాల పైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. వాటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తాప్సీ తెలిపింది.-


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS