'డిస్కోరాజా' సంగతేంటి మాస్‌రాజా?

మరిన్ని వార్తలు

నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నాడన్న రూమర్స్‌తో రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా' సినిమా ఆగిపోయిందనే వార్తలు ఈ మధ్య చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ సినిమా షూటింగ్‌ సవ్యంగానే సాగుతోందట. త్వరలోనే విడుదలకు సిద్ధం కానుందట. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి రామ్‌ తాళ్లూరి నిర్మాత. పాయల్‌ రాజ్‌పుత్‌, రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మధ్య విడుదలైన టైటిల్‌ లోగో, ఫస్ట్‌లుక్‌ టీజర్‌ తప్ప మరో అప్‌డేట్‌ రాలేదీ సినిమాకి సంబంధించి.

 

ప్రచారంలో ఉన్న రూమర్స్‌ దృష్ట్యా రవితేజ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి అప్‌డేట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలో త్వరలో టీజర్‌ విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట 'డిస్కోరాజా' టీమ్‌. ఈ సినిమాలో రవితేజ డబుల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సంగతిటుంచితే, లేటెస్ట్‌గా రవితేజ మరో సినిమానీ లైన్‌లో పెట్టేశాడట. రవితేజతో 'బలుపు', 'డాన్‌ శీను' సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ ఓకే అన్నాడనీ తెలుస్తోంది.

 

ఇది కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ అని తెలుస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రవితేజ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తన నేచర్‌కి భిన్నంగా డిఫరెంట్‌ స్టోరీస్‌ని ఎంచుకుంటున్నాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వచ్చిన 'రాజా ది గ్రేట్‌'లో అంధుడిగా కనిపిస్తే, మొన్న వచ్చిన 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' ఒక రకం ఇప్పుడు 'డిస్కో రాజా' ఇంకో రకం. అలాగే గోపీచంద్‌ సినిమా ఇంతవరకూ రవితేజ టచ్‌ చేయని విభిన్నమైన కాన్సెప్ట్‌ అట. అదేంటో పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS