కొన్ని రోజుల క్రితం ఒక టాక్ షోలో నటి తాప్సీ తన మొదటి చిత్ర దర్శకుడైన రాఘవేంద్రరావు పైన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి.
అయితే తాను ఆరోజు ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం తో అలా మాట్లాడలేదని, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి పైన తాను ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు అని స్పష్టంచేసింది.
తన స్పందనను ఒక వీడియో తీసి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. అయితే ఇప్పటికే ఈ విష్యం రాఘవేంద్రరావు గారి వరకు వెళ్ళగా, ఆయన నవ్వేసి ఊరుకున్నట్టు సమాచారం.
ఏదైతేనేమి...తాప్సీ కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అయితే అది నెగటివ్ గా అనుకోండి.