నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, నారాలోకేశ్, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అంతకుముందు తారకరత్న అంతిమయాత్ర జరిగింది. ఫిలిం ఛాంబర్ నుంచి వైకుంఠ రథంలో ఆయన పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. తారకరత్నకు కన్నీటి వీడ్కోలు పలికారు.




